TMC remove tripura president: ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర చీఫ్ ఔట్.. బై-ఎలక్షన్ దెబ్బే అంటున్న నేతలు
- tony bekkal
- Updated on- August 24, 2022 / 05:45 PM IST
TMC remove tripura president ahead of assembly polls
TMC remove tripura president: వరుసగా మూడోసారి విజయం సాధించి పశ్చిమ బెంగాల్లో తిరుగులేని పార్టీగా అవతరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి.. రాష్ట్రం దాటి విస్తరించే ఆలోచన కలిగింది. వెంటనే చిన్న చిన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గోవా లాంటి రాష్ట్రాల్లో హడావుడి చేసినప్పటికీ బెంగాల్ భాషకు, సంస్కృతికి దగ్గరగా ఉండే త్రిపురను ప్రధానంగా లక్ష్యం చేసుకుంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల్లో ఉన్న నేతల్ని తమ పార్టీలోకి తీసుకుంది. అయితే అనంతరం జరిగిన స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పార్టీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది.
వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీని మరింత నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దే పనిలో ఉంది. ఇందులో భాగంగా మొదట రాష్ట్ర అధ్యక్షుడినే మార్చి వేసింది. త్రిపుర టీఎంసీ అధ్యక్షుడు సుబల్ భోవ్మిక్ను తొలగిస్తున్నట్లు టీఎంసీ బుధవారం ప్రకటించింది. గతేడాది ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఎంసీకి వచ్చారు. అనంతరం 132 మందితో రాష్ట్ర కమిటీ వేసి ఆయనను త్రిపుర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు టీఎంసీ సుప్రెమో మమతా బెనర్జీ ఏప్రిల్ 29 2021న ప్రకటించారు.
కాగా, భోవ్మిక్ను తొలగించడానికి గల కారణాలను పార్టీ బహిరంగంగా ప్రకటించలేదు. అలాగే తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఇంచార్జీగా రాజీవ్ బెనర్జీ, సుష్మితా దేవి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని పనులు వీరే చూసుకుంటున్నారు. కాగా, కొంత కాలం క్రితం త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీకి 2 నుంచి 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీకి చెందిన బెంగాల్ నేతలు పెద్ద ఎత్తున వెళ్లి ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల్లో రాణించలేకపోయారు.
Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు
