చంద్రయాన్-2 మరో ఫొటో: విశ్లేషణతో బయటపెట్టిన ఇస్రో
- Subhan Ali Shaik
- Published On : November 13, 2019 / 01:41 PM IST
చంద్రయాన్-1లో ఉంచిన మాదిరిగా చంద్రయాన్-2 బోర్డులో అమర్చిన (టీఎంసీ) టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా-2 పనితనం చూపించింది. టీఎంసీ-2 (0.4మైక్రీ మీటర్ నుంచి 0.85మైక్రో మీటర్లు)నుంచి దాదాపు 5మీటర్ల వరకూ ప్రత్యకమైన రిసొల్యూషన్& స్టీరియో ట్రిప్లెట్స్(మూడు కొలతలతో) స్పష్టమైన ఇమేజ్ ను పంపింది. అది కూడా అంతరిక్షం నుంచి 100కిలోమీటర్ల దూరంలో ఉండి చంద్రునిపై ఉన్న తలాన్ని అంత స్పష్టంగా ఫొటో పంపి ఆశ్చర్యపరిచింది.
ల్యూనార్ తలంపై ఉండి ఈ మూడు కోణాల్లో తీసిన ఫొటోపై ఇస్రో విశ్లేషణ జరిపింది. ఓ క్రేటర్(చంద్రుని ఉపరితలంపై ఏర్పడ్డ గుండ్రని ఆకారం గుంత)ను ఇంతటి స్థాయిలో స్పష్టమైన చిత్రం తీయగలిగింది. ఇంకా ఈ కెమెరా పనితనంతో చంద్రునిపై ఉన్న..
* క్రేటర్స్
* లావా ట్యూబ్స్
* రైల్స్
* డొర్సా లేదా రింకెల్ రిడ్జెస్
* గ్రాబెన్ నిర్మాణాలు
* ల్యూనార్ డూమ్స్/కోన్స్
ఇందులో క్రేటర్ సైజ్ ఆధారంగా అక్కడి తలం ఎన్నాళ్లుగా ఏర్పడింది. అక్కడి వాతావరణ పరిస్థితులు, ల్యూనార్ పరివర్తనంపై అంచనా వంటి పలు అంశాలను విశ్లేషించారు. ఆయా వివరాలను ఇస్రో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Indian Space Research Organisation (ISRO): 3D view of a crater imaged by TMC-2 (Terrain Mapping Camera) of Chandrayaan 2. pic.twitter.com/fTsCQTRn1X
— ANI (@ANI) November 13, 2019
