Elephants Fight: ఏనుగు, ఏనుగు కొట్టుకుని టూరిస్టుని తొక్కి చంపాయ్..

ఏనుగులకు స్నానం చేయించడాన్ని చూసేందుకు పర్యాటకులు నది సమీపంలో గుమిగూడారు. అదే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

  • Published on- May 18, 2026 / 05:46 PM IST

Elephants Fight: కర్ణాటకలోని ప్రసిద్ధ దుబారే ఏనుగుల శిబిరంలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగులను దగ్గరి నుంచి చూసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన టూరిస్ట్ ప్రాణం పోయింది. ఏనుగు, ఏనుగు కొట్టుకుని టూరిస్ట్ ని తొక్కి చంపేశాయి. గజరాజులకు స్నానం చేయిస్తుండగా శిక్షణ పొందిన రెండు ఏనుగులు పోట్లాడుకోవడంతో ఒక పర్యాటకురాలు మరణించింది. ఒక ఏనుగు అదుపుతప్పి కిందపడగా.. 33 ఏళ్ల మహిళ దాని కింద నలిగిపోయింది.

దుబారే ఏనుగుల శిబిరంలో గజరాజులకు స్నానం చేయిస్తారు. దీన్ని చూసేందుకు సందర్శకులు అక్కడికి వస్తారు. అదే సమయంలో ఊహించని ఘటన జరిగింది. శిక్షణ పొందిన రెండు ఏనుగులు అకస్మాత్తుగా పోట్లాడుకున్నాయి. అక్కడే ఉన్న టూరిస్ట్ ని తొక్కి చంపాయ్. మృతురాలిని తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల టూరిస్ట్ గా గుర్తించారు. ఈ పోట్లాటలో ఏనుగులలో ఒకటి అదుపుతప్పి కిందపడటంతో ఆ మహిళ దాని కింద నలిగిపోయిందని అధికారులు తెలిపారు.

కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఏనుగులకు స్నానం చేయిస్తారు. ఇది చూసేందుకు పర్యాటకులు నది సమీపంలో గుమిగూడారు. అదే సమయంలో ఈ సంఘటన జరిగింది. అధికారుల ప్రకారం శిక్షణ పొందిన కంజన్, మార్తాండ అనే రెండు ఏనుగులను వాటి మావటీలు నీటిలో కడుగుతుండగా అవి పోట్లాడుకోవడం ప్రారంభించాయి.

ఘర్షణలో అదుపుతప్పి పడిపోయిన ఏనుగు..

వెంటనే అప్రమత్తమైన మావటీలు ఏనుగులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఏనుగులు పోట్లాడుకోవడం ఆపలేదు. ఈ పెనుగులాటలో కంజన్ మార్తాండపైకి దూకి ఢీకొట్టింది. మార్తాండ అదుపుతప్పి కుప్పకూలడంతో సమీపంలో నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న తులసి అనే టూరిస్ట్ ఏనుగు కింద చిక్కుకుపోయింది. ఈ ఘటనలో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. ఈ అనూహ్య సంఘటన సందర్శకులను, సిబ్బందిని షాక్ కి గురి చేసింది. టూరిస్టులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏనుగులతో పర్యాటకులు సన్నిహితంగా ఉండే కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. వాటికి మరీ దగ్గరగా ఉండకుండా, దూరం నుంచే చూసేలా చర్యలు చేపట్టారు.

Also Read: ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పని దినాలు.. ఈ రంగాల్లో అమలుకు కేంద్రం నిర్ణయం?