Vijay Marksheet : నెట్టింట వైరల్ అవుతోన్న విజయ్ మార్క్స్ షీట్.. ఆ సబ్జెక్ట్ అంటే దళపతికి కూడా భయమే.. జస్ట్ పాస్..!

Vijay Marksheet : టీవీకే అధినేత విజయ్ పదో తరగతి మార్క్స్ షీట్ నెట్టింట వైరల్ గా మారింది.

TVK Vijay class 10th marksheet goes viral After Tamil Nadu class 12th results are declared

Vijay Marksheet : తాజాగా వెల్లడించిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తొలి ప్రయత్నంలోనే 108 స్థానాలను గెలుచుకుని తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. మెజారిటీకి 10 స్థానాల దూరంలో ఉండటంతో తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకం కలిగింది. కానీ, తాజాగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతు లభించడంతో.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే, నేడు తమిళనాడు 12వ తరగతి (HSE+2) బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో విజయ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. మే 2026లో విడుదలైన ఈ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత శాతం 95.03%గా నమోదైంది. ఈ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. అనేక జిల్లాలు, పాఠశాలలు 100 శాతానికి దగ్గరగా ఉత్తీర్ణతను నమోదు చేశాయి.

Vijay class 10th marksheet

ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను విజయ్ అభినందిస్తూ ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేశారు. విద్యార్థుల కష్టాన్ని, అంకితభావాన్ని కొనియాడిన ఆయన.. ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని కోరారు. అదే సమయంలో పరీక్షలో తప్పిన విద్యార్థులకు విజయ్ ధైర్యం చెప్పారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దని, నమ్మకంతో మళ్లీ ప్రయత్నించాలని, నిరంతరం శ్రమించే వారికి విజయం ఖచ్చితంగా లభిస్తుందని పేర్కొన్నారు.

TVKకు కాంగ్రెస్ మద్దతు.. సంచలన నిర్ణయం తీసుకున్న డీఎంకే.. లోక్ సభ స్పీకర్ కు లేఖ

ఈ క్రమంలోనే విజయ్ పదో తరగతి మార్క్ షీట్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మార్క్ షీట్ ప్రకారం.. విజయ్ పదో తరగతిలో 1100 మార్కులకు గాను 711 మార్కులు సాధించారు. అంటే మొత్తం 64.6 శాతం మార్కులతో ఆయన ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

మార్క్ షీట్ వివరాలు:

  • సైన్స్: 206 / 300
  • తమిళం: 155 / 200
  • ఇంగ్లీష్: 133 / 200
  • సోషల్ సైన్స్: 122 / 200
  • గణితం (Maths): 95 / 200

గణితంలో 200కి గాను 95 మార్కులు రావడంతో.. ఆయన లెక్కల్లో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అయితే ఈ మార్క్ షీట్ నిజమో కాదో అధికారికంగా తెలియకపోయినప్పటికీ, ప్రస్తుతం ఇంటర్ ఫలితాల వేళ ఇది నెట్టింట వైరల్‌గా మారింది.