TVK Vijay Oath Taking : ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..
TVK Vijay Oath Taking : తమిళనాడు నూతన సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారయ్యింది.
- Dharani Pilli
- Updated on- May 8, 2026 / 08:01 PM IST
TVK Vijay to take oath as Tamil Nadu CM tomorrow at 11 am
TVK Vijay Oath Taking : తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మే 9, శనివారం నాడు తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే (TVK) అధినేత విజయ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారు. తమిళనాట ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లలో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 118 సీట్లు. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే తరఫున ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజయ్ గతంలోనే గవర్నర్‌ను కలిశారు. అయితే, పూర్తి మెజారిటీ నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, మరియు సీపీఐ పార్టీలు విజయ్‌కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో విజయ్ 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మూడోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించడంతో శనివారం (మే 9న) ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పార్టీల వారీగా సంఖ్యాబలాలు పరిశీలిస్తే..
- టీవీకే : 107;
- కాంగ్రెస్ : 5;
- సీపీఐ : 2;
- సీపీఎం : 2;
- వీసీకే : 2.
