ముంబైకి చెందిన రణు మొండల్ రైల్వేస్టేషన్ లో లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా’ పాట వైరల్ అవడంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిన విషయం తెలిసిందే. తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకుని సింగర్ గా మారిపోయింది. హిమేష్ రేష్మియాతో కలిసి ‘తేరీ మేరీ కహానీ’ పాట పాడి మరింత క్రేజ్ తెచ్చుకుంది.
అయితే ఆమె వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు అడుక్కుంటూ బ్రతికిన ఆమె రూపం.. వేషం అన్నీ మారిపోయాయి. అంతా బాగానే ఉంది కానీ అసలు ఆమెను సోషల్ మీడియాలో ఫెమ్ చేసిన నెటిజన్స్ మీదనే రణు ఫైర్ అవుతోంది. దీంతో ఆమె బిహేవియర్ చూసి నెటిజన్స్ తెగ తిడుతున్నారు.
తాజాగా రణు ఓ సూపర్ మార్కెట్ కి షాపింగ్ కోసం అని వెళ్లింది. అక్కడ ఓ మహిళా అభిమాని ఆమె భుజం పై తట్టి సెల్ఫీ అడిగింది. దీంతో రణు వెంటనే నా చేయి ఎందుకు పట్టుకున్నావ్ అంటూ.. ఆ మహిళపై ఫైర్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడినుంచి వచ్చారో మరిచిపోయారా? అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Don’t touch me, I’m celeb now : Ranu Mondal
We made her celebrity and now see her attitude.#ranumondal #ranumandal pic.twitter.com/HOGFPYnU4s— HasegaIndia (@indiahasegaa) November 4, 2019