Vice President CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం… ఎవరెవరు హాజరయ్యారంటే?
ధన్‌ఖడ్ కూడా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా చేసిన తరువాత ధన్‌ఖడ్ బయట కనపడడం ఇదే తొలిసారి. (CP Radhakrishnan)

CP Radhakrishnan
Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (67) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించారు.
రాధాకృష్ణన్ మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. జూలై 21న జగదీప్ ధన్కడ్ ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక నిర్వహించారు.
Also Read: అమెరికాలో భారత సంతతి వ్యక్తి తలను నరికేసిన తోటి ఉద్యోగి.. అక్కడితోనూ ఆగకుండా..
ధన్‌ఖడ్ కూడా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా చేసిన తరువాత ధన్‌ఖడ్ బయట కనపడడం ఇదే తొలిసారి. (CP Radhakrishnan)
రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. అలాగే, మాజీ ఉపరాష్ట్రపతులు హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి రాధాకృష్ణన్ నిన్న వైదొలిగినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.