UIDAI: ఆధార్ హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఆరునెలల పాటు ఈ సేవలు ఉచితం

ఆధార్ హోల్డర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక తీపి కబురు అందించింది.

Uidai made the service of updating email ID on Aadhaar card for free

  • ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్ ఫీజు రద్దు.
  • ఆరు నెలల పాటు ఉచిత సేవలు.
  • మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అవకాశం.

UIDAI: ఆధార్ హోల్డర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక తీపి కబురు అందించింది. ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవడానికి ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.75 రుసుమును రాబోయే ఆరు నెలల పాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉచిత సదుపాయం 2026 జూలై 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Ktr: రైతులకు మరణశాసనం.. పంటలు కొనే నాథుడే లేడు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ఈ ప్రత్యేక మినహాయింపు కేవలం కొత్తగా తీసుకొచ్చిన అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసుకునే అప్‌డేట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. వినియోగదారులు తమ మొబైల్ యాప్‌లో రిజిస్టర్డ్ వివరాలతో లాగిన్ అయి, ఈమెయిల్ చిరునామాను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌కు ఈమెయిల్ లింక్ చేయడం వల్ల భద్రతాపరమైన అప్డేట్స్, ఓటీపీలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం తక్షణమే పొందే వీలుంటుంది.

ఈ యాప్‌లో ఈమెయిల్ మార్పుతో పాటు బయోమెట్రిక్ లాక్, చిరునామా మార్పు, ఈ-ఆధార్ డౌన్‌లోడ్ వంటి మరెన్నో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత ఈ ఉచిత సేవను పొడిగించాలా లేదా మళ్లీ పాత ఫీజును పునరుద్ధరించాలా అనే అంశంపై UIDAI ఆ తర్వాత నిర్ణయం తీసుకోనుంది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.