New Farm Bill: రెండ్రోజుల్లో లోక్‌సభకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ హామీ మేరకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రంగం సిద్ధం అవుతుంది. నవంబర్ 19న జరిగిన ప్రకటనానుసారం నవంబర్ నెలాఖరుకు రద్దు బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

New Farm Bill: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ హామీ మేరకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రంగం సిద్ధం అవుతుంది. నవంబర్ 19న జరిగిన ప్రకటనానుసారం నవంబర్ నెలాఖరుకు రద్దు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతులు మీదుగా జరగనున్నట్లు సమాచారం.

బిల్లు రద్దుపై హామీ ఇచ్చినప్పటికీ చట్టం రద్దయ్యే వరకు నిరసన ఆపేది లేదని రైతులు మొండికేశారు. పంటకు కనీస మద్ధతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం బిల్లును తొలి రోజే తీసుకురానుంది.

నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. సమావేశాలు మొదలైన మొదటి రోజునే 3 వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హామీ ఇచ్చారు.

……………………………….. : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందా ? – ఉండవల్లి

పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కనీస మద్దతు ధర అమలుపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. కమిటీలో వ్యవసాయ సంఘాల ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్నారు.

‘వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన తర్వాత ఇక రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వెంటనే రైతులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆందోళనలు, నిరసనలు సమయంలో రైతులపై నమోదైన కేసులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి. కేసులు ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. నష్ట పరిహారానికి సంబంధించి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.

ట్రెండింగ్ వార్తలు