Undavalli : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందా ? – ఉండవల్లి

అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Undavalli : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందా ? – ఉండవల్లి

Babu Tears

Undavalli Arun Kumar : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సీఎం అయిన తరువాతే వస్తానని అన్నారు..వచ్చి ఏ చేస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. మానసికంగా దెబ్బతిన్న వాళ్ళే అసెంబ్లీలో అలా కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇటీవలే అసెంబ్లీలో జరిగిన పరిణామాల క్రమంలో…టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో బోరున విలపించిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని వైసీపీ నేతలు అవమాన పరుస్తున్నారంటూ…ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో..ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ  ఎంపీ ఉండవల్లి స్పందించారు. 2021, నవంబర్ 27వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షంపై ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని, ప్రతిపక్షాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యం మాని వారియొక్క సలహాలు తీసుకొంటే…సీఎం జగన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నారు.

Read More : New Variant omicron : కొత్త వేరియంట్ ను అడ్డుకోవటానికి సీఎం కేజ్రీవాల్ ముందస్తు జాగ్రత్తలు..

మరోవైపు అధికారపక్షంపై కూడా విమర్శలు గుప్పించారు ఉండవల్లి. ఇటీవలే మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సీఎం జగన్ కు అవగాహన లేకే వెనక్కి తీసుకున్నారని చెప్పారు. పార్టీలు ఏకపక్షంగా వ్యవహరించేటప్పుడు అసెంబ్లీ అవసరమా అని నిలదీశారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకపోయిందని, కేంద్రం కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ లో వచ్చే నిధుల్లో..అవకాశం ఏపీ రాష్ట్రం కోల్పోయిందని వివరించారు.

Read More : Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు

రెండు సంవత్సరాలైనా…పోలవరానికి కేటాయించిన నిధులను కేంద్రం నుంచి తేలేకపోవడం దురదృష్టకరమన్నారు. పోలవరం నిధులు ఇవ్వమని  కేంద్రం చెప్పిందన్నారు. మరోవైపు..కరెంటు బాకీ కట్టాల్సింది రూ. 25 వేలు కోట్లు కాగా…కాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది రూ. 75 వేల కోట్లు అంటూ చెప్పుకొచ్చారు. లంచగొండితనాన్ని నివారించలేకపోవడంతో ప్రభుత్వంపై నిరసన మొదలైందని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇటీవలే హత్యకు గురైన వివేకా విషయంలో వస్తున్న ఆరోపణలు, విమర్శలపై కూడా ఆయన స్పందించారు. వివేకా తనకు చాలా అత్యంత సన్నిహితుడని, జగన్ కు సంబంధం లేదని తాను భావిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి తెలిపారు.