Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు

టెంపుల్‌ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు.

Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు

Tirupati

Shrinking houses in Tirupati : టెంపుల్‌ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. శ్రీకృష్ణ నగర్‌లో ఉన్నట్టుండి ఇళ్లు కుంగుతున్నాయి. ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. బీటలు వారాయి. దీంతో పలు బిల్డింగ్‌లో ఎప్పుడు కూలుతాయో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

తిరుపతి నగరాన్ని వర్షాలు ఇటీవలే ముంచెత్తాయి. కాలనీలన్నీ వరద, బురదమయంగా మారాయి. వరద నీరు నిల్వడంతో స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. మొన్నటికి మొన్న నీరు నిల్వ ఉండడంతో వాటర్‌ ట్యాంక్‌ పైకి వచ్చింది. ఇక నిన్న సాయంత్రం తిరుపతి వాసులను భూ ప్రకంపనలు టెన్షన్‌ పెట్టాయి. ఇంతలోనే ఇప్పుడు ఉన్నట్టుగా ఇళ్లు భూమిలోకి కుంగుతున్నాయి. పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి. ఇన్ని ప్రకృతి విపత్తులు తమను వెంటాడుతున్నా.. రాజకీయ నాయకులు మాత్రం తమవైపు చూడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Corona : కర్ణాటకలో 215 మంది విద్యార్థులకు కరోనా.. బాధితులంతా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారే..!

భారా వర్షాల కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో .. చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.. కలెక్టర్‌ హరినారాయణ్‌. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో .. అధికారులు, సిబ్బంది అప్రమత్తం అవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాజ్‌వేలు దాటకూడదని సూచించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.