తన లైంగిక వాంఛలు తీర్చలేదని 14ఏళ్ల బాలికను చచ్చిపోయేలా హింసించాడు 19ఏళ్ల యువకుడు. ఉత్తరప్రదేశ్ లోని ఎతా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బంధువుల ఇంటికి ఫంక్షన్ కు వెళ్లిన బాలికపై ఈ దాడి జరిగింది. శనివారం సాయంత్రం ఒంటరిగా ఇంటికి తిరుగు ప్రయాణం అయింది.
నిందితుడు బాలికను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లాడు. విడిపించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓ వస్తువు తీసుకుని తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. పేరెంట్స్ తో పాటుగా బాలిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులకు విషయం గురించి చెప్పి ఫిర్యాదు చేసింది.
వెంటనే బాలికను ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు పంపించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుడ్ని ఆదివారం అరెస్టు చేశారు. మహిళపై హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచారు. జ్యూడిషియల్ కస్టడీకి తరలించి రిమాండులో ఉంచాల్సింది సూచించింది కోర్టు.