Uttar Pradesh : జీన్స్,టీ షర్ట్ ధరించాలని అత్తగారు వేధిస్తోంది అంటూ కోడలు ఫిర్యాదు

మా అత్తగారు జీన్స్, టీషర్టు వేసుకోమని వేధిస్తోంది అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.

Uttar Pradesh : జీన్స్,టీ షర్ట్ ధరించాలని అత్తగారు వేధిస్తోంది అంటూ కోడలు ఫిర్యాదు

UP Yong Woman complaint

Uttar Pradesh Woman police complaint : సాధారణంగా ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు చీరలు కట్టుకోమంటే అమ్మో చీరా..?అంటున్నారు.అదే జీన్స్ పాంట్ వేసుకోమంటే ఎగిరి గంతేస్తుంటారు. వివాహం అయినా..పిల్లలు పుట్టినా చాలామంది యువతులు జీన్స్,టీషర్టు ధరిస్తున్నారు. ఇంట్లో అత్తగారు అదేంటమ్మా..జీన్స్ ఏంటీ చక్కగా చీర కట్టుకో అని అంటే చిరాగ్గా మొహం పెడుతుంటారు. కానీ యూపీలోని ఓ కుటుంబంలో అత్తాకోడళ్ల వ్యవహారం దీనికి ఫుల్ రివర్స్ లో ఉంది. అత్తగారు తన కోడల్ని జీన్స్, టీషర్టు వేసుకోమంటుంటే ఆ కోడలు వద్దు వద్దు చీరే కట్టుకుంటానని చీరే కట్టుకుంటోంది.

దీంతో అత్తకు అంతెత్తున కోపం వచ్చింది. జీన్స్ వేసుకోమంటే చీర కట్టుకుంటావేంటీ..అంటూ గొడవకు దిగుతోంది. అంతేకాదు చీర వద్దు జీన్స్ వేసుకోవాల్సిందేనని కోడలిపై ఒత్తిడి తెస్తోంది. మామగారిది కూడా అదే తీరు. ఇక కొడుకు కూడా వంతపాడేసరికి పాపం ఆమెకు జీన్స్ పాంట్ వేసుకోవటం ఇష్టం లేక..చీరే కట్టుకుంటోంది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ‘ మా అమ్మ జీన్స్ వేసుకోమంటే చీర కట్టుకుంటావేంటీ’..అంటూ భర్త కూడా సాధింపులే కాదు భార్యపై చేయి చేసుకునేవరకు వెళ్లింది. తనను జీన్స్ పాంట్ వేసుకోమని తన ఇంట్లో వేధిస్తున్నారు అంటూ సదరు కోడలు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల

ఈ వింత కేసు వివరాల్లోకి వెళితే..యూపీలోని హరిపర్వత్ కు చెందిన ఓ యువకుడికి ఎత్మాద్ పూర్ కు చెందిన అమ్మాయితో కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అత్తా మామలు పక్కా మోడ్రన్. కానీ కోడలు మాత్రం సంప్రదాయం పద్ధతిలో చీర కట్టుకోవటానికే ఇష్టపడేది. దీంతో అత్తా..మామ, భర్త జీన్స్, టీ షర్టు వేసుకోవాలని పట్టుపట్టేవారు. దానికి ఆమె నిరాకరించేది. దీంతో ఆమెను వెక్కిరించటం..సూటీ పోటీ మాటలు మాట్లటమే కాకుండా భర్త కొట్టటం కూడా జరుగుతోంది. ఇలా రోజు రోజు గొడవలు పెరుగుతున్నాయి. దీంతో ఆమె తన పుట్టింటివాళ్లకు విషయం చెప్పి ఏడ్చింది.

దీంతో కోడలు ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జీన్స్ వేసుకోవటం ఇష్టంలేదని..చీర కట్టుకోవటమే ఇష్టమని అదే విషయం తన భర్తకు చెప్పిన వినకుండా తనను కొడుతున్నాడని చెప్పుకుని వాపోయింది. ఆమె ఫిర్యాదు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసులు నచ్చచెప్పేందుకు యత్నించినా ఫలితం లేదు. దీంతో ఫ్యామిలి కౌన్సెలింగ్ సెంటర్ కు చేరిందీ తగాదా. కానీ ఆమె మాత్రం చీర తప్ప జీన్స్ వేసుకోనని ఖరాగా చెబుతోంది.