Uttarkashi Tunnel : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగానే ఉన్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను సీఎం పుష్కర్ సింగ్ ధర్మాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Uttarkashi Tunnel : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల

Uttarkashi Tunnel Workers First Visuals

Uttarkashi Tunnel Crash : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. 10 రోజులుగా సొరంగంలోనే ఉండిపోయిన 41మంది కార్మికులు పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన కొనసాగుతున్న క్రమంలో సొరంగంలో వారు క్షేమంగానే ఉన్నట్లుగా దృశ్యాలు విడుదల అయ్యాయి. నవంబర్ 12న సొంరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

వారి క్షేమంగా గురించి తెలుసుకునే యత్నంలో భాగంగా పైపు ద్వారా ఎండోస్కోసిక్ కెమెరా పంపించారు. ఈ కెమెరాలో వారు క్షేమంగా ఉన్నట్లుగా మొదటిసారి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారిని రక్షించే ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ విజువల్స్ లో కార్మికులు తమ హార్డ్ టోపీలు కనిపించారు. విజువల్స్‌లో సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను లెక్కించినట్లుగా కనిపించింది. అలాగే కార్మికులతో అధికారులు మాట్లాడి వారిక్షేమ సమాచారం తెలుసుకున్నారు.

కాగా.. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన దృశ్యాలను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధర్మాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇన్‌ఛార్జ్ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. కార్మికులంతా క్షేమంగానే ఉన్నారని..వారిని త్వరలోనే సురక్షితంగా కాపాడతామని తెలిపారు. వారితో కమ్యునికేట్ కోసం మొబైల్‌లు, ఛార్జర్‌లను పైపు ద్వారా పంపిస్తామని తెలిపారు.

Also Read: ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు 5 మార్గాలు

సొరంగంలో ఉన్న కార్మికులు ఇప్పటి వరకు డ్రైఫ్రూట్స్ , నీళ్లతోనే జీవిస్తున్నారు. సోమవారం వారికి గాజు సీసాలలో వేడి వేడి కిచ్డీని పంపించారు. పైప్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలు, మందులు అందిస్తున్నారు. కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.