Bottled Water Prices Hike : ఇరాన్-అమెరికా యుద్ధం.. ఇండియాలో భారీగా పెరగనున్న వాటర్ బాటిల్ ధరలు

Bottled Water Prices Hike : యుద్ధం ప్రభావంతో చమురు ధరలు మాత్రమే కాదు.. ఆఖరికి తాగు నీటి ధరలు కూడా భారీగా పెరుతాయి అంటున్నారు.

us iran war effects indias bottled water prices to soar

  • అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావంతో
  • ఇండియాలో పెరగున్న తాగునీటి ధరలు
  • ఇప్పటికే ధరలు పెంచిన బిస్లెరీ

Bottled Water Prices Hike : అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం.. ప్రపంచ దేశాలతో పాటు ఇండియా మీద కూడా బాగానే పడింది. ఇప్పటికే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడి.. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటోలు వంటివి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం సామాన్య ప్రజల మీద కూడా భారీగానే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే దేశంలో మంచినీటి ధరలు కూడా పెరుగుతాయంటున్నారు. మన దేశంలో వేసవిలో సామాన్యంగానే నీటికి చాలా డిమాండ్ ఉంటుంది. తాగునీటికి కూడా డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం.. నీటి బాటిళ్ల తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి బాటిళ్ల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల కొరతతో తయారీదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికే బిస్లరీ కంపెనీ 11 శాతం ధరలను పెంచింది. మిగతా బ్రాండ్లు కూడా ధరలను పెంచుతున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే.. ఇండియాలో బాటిల్ నీరు ఖరీదైన వస్తువుగా మారుతుంది అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రపంచ చమురు, ఎల్‌పీజీ రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసి వేయడంతో.. అంతర్జాతీయ నౌకా రవాణా దెబ్బతిన్నది. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి.

Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ..!

చమురు, సహజవాయువు దిగుమతిపై ఎక్కువగా ఆధారపడిన ఇండియాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ముఖ్యమైన పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) రెసిన్ గుళికల తయారీకి ముడి చమురే ముఖ్యం. ఈ గుళికలను వేడి చేసి.. అచ్చుల్లో పోసి ‘ప్రీఫార్మ్స్’గా రూపొందిస్తారు. ఆ తర్వాత.. బాటిల్ తయారీదారులు వారి అవసరానికి అనుగుణంగా వివిధ పరిమాణాలు, ఆకారాల్లో వీటిని బాటిళ్లుగా తయారు చేస్తారు. అయితే యుద్ధం కారణంగా.. చమురు ధరలు పెరగడంతో.. 15 రోజుల్లోనే ఈ ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయి.

Beer Prices Rise : మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న మద్యం ధరలు.. కారణమిదే

ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం వరకు పెరగడంతో.. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 20కి చేరిందని బిస్లెరి యాజమాన్యం తెలిపింది. పైగా ఈ మధ్య కాలంలోనే PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. మన దేశంలో 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీంతో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం ఇళ్లు దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి. అయితే పెరిగిన చమురు ధరల ప్రభావంతో PET ప్రిఫార్మ్స్ ధర కూడా పెరగడంతో.. బాటిల్ వాటర్ ధరలు భారీగా పెరిగాయి.