Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ..!
దెబ్బతిన్న ఎఫ్35 యుద్ధం విమానం నుంచి ఎజెక్ట్ బటన్ నొక్కి యూఎస్ పైలట్ బయటపడినట్లు ఐఆర్ జీసీ ప్రకటించింది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికా పైలట్ ను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ దీన్ని ఇంకా ధృవీకరించలేదు.
Iran War: బాంబుల మోతలతో, మిస్సైల్స్ మెరుపులతో మిడిలీస్ట్ కంట్రీస్ దద్దరిల్లాయి. పశ్చిమాసియాలో ఇప్పుడు పక్షుల ఎగరడం లేదు. కేవలం మిస్సైల్స్, డ్రోన్లు ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఏ డ్రోన్ ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఏ మిస్సైల్ ఎప్పుడు వచ్చి మీద పడుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో పశ్చిమాసియా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రతీకార దాడుల్లో ఇరాన్ డోస్ పెంచింది.
ఈ రివెంజ్ అటాక్స్ లో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వాయుసేనకు చెందిన మరో ఎఫ్35 ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. దెబ్బతిన్న ఎఫ్35 యుద్ధం విమానం నుంచి ఎజెక్ట్ బటన్ నొక్కి యూఎస్ పైలట్ బయటపడినట్లు ఐఆర్ జీసీ ప్రకటించింది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికా పైలట్ ను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ దీన్ని ఇంకా ధృవీకరించలేదు.
ఇజ్రాయెల్ పై కొత్త మిస్సైల్ సాల్వోను ప్రయోగించింది ఇరాన్. ఇటు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ కూడా చాలా వాటిని ధ్వంసం చేసి ఇరాన్ దాడులను కట్టడి చేశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ 300కు పైగా నగరాల్లో సైరన్లు మోగించింది. యూస్ మిత్ర దేశాలను ఇరాన్ వదిలిపెట్టడం లేదు. కువైట్ లోని రిఫైనరీపై డ్రోన్లతో అటాక్ చేసింది. బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియాపై మిస్సైల్, డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. వీటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
టెహ్రాన్ నుంచి ఇరాన్ ఓ మిస్సైల్ ను లాంచ్ చేసింది. కానీ అది కాస్త ఫెయిల్ అయ్యింది. అదే నగరంలో పడింది. అమెరికా కూడా ఇరాన్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. అతి పెద్ద బ్రిడ్జిని కూల్చేసింది. కరాజ్-టెహ్రాన్ మధ్య ఉన్న బ్రిడ్జిపై అటాక్ చేసింది. ఈ దాడిలో 8 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు సెంట్రల్ ఇరాన్ లోని ఏరియాలో స్టీల్ ప్లాంట్స్, ఫార్మాసూటికల్స్ యూనిట్లను కూడా అమెరికా టార్గెట్ చేసింది.
