Yogi Adithyanath: చిరుతకు పాలు తాగించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ .. వీడియో వైరల్..
చిరుత పులికి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలు తాగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
- Harish Thanniru
- Published on- October 6, 2022 / 09:54 AM IST
UP CM Yogi
Yogi Adithyanath: చిరుత పులికి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలు తాగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వణ్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా గోరఖ్‌పుర్‌లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జువలాజికల్ పార్క్‌ను సీఎం ఆదిత్యనాథ్ సందర్శించారు. తెల్ల పులి గీతను జంతు ప్రదర్శన శాలలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని అధికారులు ఇక్కడికి తీసుకొచ్చారు.
CM Yogi Adhityanath drank milk to a leopard
చిరుతను పిల్లను జంతు ప్రదర్శన శాలలోకి వదిలిపెట్టే ముందు యోగి ఆదిత్యనాథ్ దానికి పాలు పట్టించారు. గోరఖ్‌పుర్‌లోని వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు యోగేశ్ సింగ్ పర్యవేక్షణలో చిరుత పిల్లను ఒడిలోకి తీసుకున్న సీఎం.. డబ్బాతో పాలు తాగించారు. అంతేకాదు.. ఆ చిరుత పిల్లకు చండీ అని పేరు పెట్టారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ చిన్నారి చిరుతను తన ఒడిలోకి తీసుకొని పాలు తాగిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు సీఎంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఏది చేసిన వెరైటీగానే ఉంటుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
