Viral Video : బాబోయ్.. కారు టాప్ మీద నిద్రపోతూ కనిపించిన చిన్నారులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఇద్దరు చిన్నారుల విషయంలో పేరెంట్స్ నిర్లక్ష్యం విమర్శలకు దారి తీసింది. కారు టాప్ మీద ప్రమాదకర పరిస్థితుల్లో చిన్నారులు ప్రయాణిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video : బాబోయ్.. కారు టాప్ మీద నిద్రపోతూ కనిపించిన చిన్నారులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Viral Video

Viral Video : ఇద్దరు చిన్నారులు.. మహా అయితే ఇద్దరి వయసు 10 లోపు ఉంటుంది. కారు టాప్ మీద నిద్రిస్తూ కనిపించారు. గోవాలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న ఆ చిన్నారుల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు.

Kalki 2898 AD : బాంబే ఐఐటి ఫెస్ట్‌లో కల్కి పోస్టర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

మపుసా సమీపంలోని పర్రా గ్రామం మదానీలో తీసిన ఓ వీడియో జనాలను షాక్‌కి గురి చేసింది. @pulse_pune అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియోలో కారు టాప్ పైన ఇద్దరు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో నిద్రపోతున్నట్లు కనిపించారు. ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా ఏదో అనడం వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. మపుసా పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ చెప్పారు.

Dosa: అక్కడ మసాల దోశ 600 రూపాయలు.. వీడియో వైరల్

పోలీసుల చెబుతున్న ప్రకారం ఈ వీడియో డిసెంబర్ 27 న సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారుల తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవుతోంది.