CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. అలా చేస్తే లక్ష బహుమతి.. అదిరిపోయే ఆఫర్
CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- May 19, 2026 / 11:06 PM IST
Tamil Nadu CM Vijay
CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశం మొత్తం తమిళనాడు వైపు చూసేలా చేస్తున్నారు. అయితే, తాజాగా.. విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలా చేస్తే లక్ష రూపాయలు ఇస్తానంటూ తమిళనాడు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Also Read : Software jobs : ఐటీ ఉద్యోగులకు భారీషాక్.. భారత ఐటీ రంగానికి ముప్పు తప్పదా? సాఫ్ట్‌వేర్ ఉచితం కాబోతోంది..
విజయ్ సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు నడుం బిగించింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, స్వచ్ఛతను తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని బలోపేతం చేస్తూ సాహసోపేతమైన సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని విజయ్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసి అవినీతిని బయటపెడితే రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని తెలిపింది. లంచం మొత్తం చిన్నదైనా, పెద్దదైనా చర్యలు తప్పవని విజయ్ సర్కార్ స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చింది.
తమిళనాడులో ఏ ప్రభుత్వ శాఖలోనైనా మీ నుండి కేవలం రూ.1000 లంచం డిమాండ్ చేసినా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు. ఈ పిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 24గంటలూ పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు భయపడకుండా పిర్యాదు ఇవ్వొచ్చునని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ సేవలు పొందడానికి సామాన్యులు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని పూర్తిగా తొలగించడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
విజయ్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చకు దారితీశాయి. అయితే, ప్రజలకు పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే మద్యం దుకాణాల విషయంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. విజయ్ నిర్ణయంతో 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. రాష్ట్ర మొత్తం 4,765 మద్యం రిటైల్ దుకాణాలు TASMAC ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సీఎం విజయ్ నిర్ణయం ప్రకారం.. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదు. దీంతో 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
