Video: కర్ర పట్టుకుని దూసుకొచ్చి.. నడిరోడ్డుపై యువకుడి గల్లా పట్టుకుని అమ్మాయి రచ్చ రచ్చ..

Video: కర్ర పట్టుకుని దూసుకొచ్చి.. నడిరోడ్డుపై యువకుడి గల్లా పట్టుకుని అమ్మాయి రచ్చ రచ్చ..

Viral Video

‘నా కొత్త కారుని ఢీ కొడతావా’.. అంటూ నడిరోడ్డుపై యువకుడి గల్లా పట్టుకుని ఓ అమ్మాయి రచ్చ రచ్చ చేసింది. అతడిని బెదిరిస్తూ రెచ్చపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డుపై ఓ యువతి కారును అనుకోకుండా ఓ యువకుడు తన స్కూటర్‌తో ఢీ కొట్టాడు. అంతే.. కారు డోరు తీసుకుని దూసుకొచ్చిన ఆ అమ్మాయి.. చట్టపరంగా అతడిపై చర్యలు తీసుకునేలా చేస్తానని, పోలీస్ కేస్ పెడతానని బెదిరించింది. ఓ కర్ర పట్టుకుని దానితో కొట్టినంత పని చేసింది.

ఆ స్కూటర్ డ్రైవర్ తన తప్పును ఒప్పుకున్నప్పటికీ, ఆ సమస్య పరిష్కారం కోసం ఆమెతో పాటు పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి అంగీకరించినప్పటికీ ఆ యువతి వెనక్కు తగ్గలేదు. ఆ స్కూటర్ ను ఇక్కడే ఇప్పుడే తగులబెడతామని బెదిరించింది. స్థానికులు వచ్చి ఆ యువతిని శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు తమ స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు ఆ అమ్మాయి చర్యలపై విచారణకు ఆదేశించారు.

Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు కామెంట్స్.. పబ్లిసిటీ స్టంట్ అంటూ..