Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు కామెంట్స్.. పబ్లిసిటీ స్టంట్ అంటూ..

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు అర్బాజ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ అంటూ..

Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల పై సోదరుడు కామెంట్స్.. పబ్లిసిటీ స్టంట్ అంటూ..

Arbaaz Khan reaction post on Salman Khan firing incident

Updated On : April 15, 2024 / 7:53 PM IST

Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద నిన్న (ఏప్రిల్ 14) ఉదయం తుపాకులతో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సిసి టీవీ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి సల్మాన్ ఇంటి ఎదురుగా నాలుగు రౌండ్లు తుపాకులతో కాల్పులు జరిపారు.

ఈ అవాంఛనీయ సంఘటనతో సల్మాన్ ఖాన్ అభిమానులు, కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయం గురించి పలువురు మాట్లాడుతూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ పై, జరిగిన సంఘటన పై సల్లు భాయ్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.

Also read : Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల అలజడి.. ఏం జరిగింది..?

ఆ పోస్టులో అర్బాజ్ ఖాన్ ఇలా చెప్పుకొచ్చారు..
“సల్మాన్ ఖాన్ కుటుంబం నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై వచ్చి కాల్పులు జరిపిన సంఘటన మమ్మల్ని చాలా కలవరపెడుతోంది. ఈ షాకింగ్ ఘటనతో మా కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది వ్యక్తులు మా కుటుంబానికి సన్నిహితులమని చెప్పుకుంటూ, అధికార ప్రతినిధిగా నటిస్తూ, మీడియాకు ముందుకు వచ్చి అదంతా పబ్లిసిటీ స్టంట్ అని లూజ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

ఈ ఘటనపై సల్మాన్ కుటుంబ సభ్యులెవరూ మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ చేస్తున్న వారికీ, మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే వారి స్టేట్‌మెంట్స్ లో కూడా నిజం లేదు. మా కుటుంబాన్ని రక్షించడానికి మరియు సురక్షితంగా ఉంచడానికి పోలీసులు కష్టపడుతున్నారు. ముంబై పోలీసులపై మాకు పూర్తీ నమ్మకం ఉంది. ఈ అవాంఛనీయ సంఘటన దర్యాప్తులో ముంబై పోలీసులకు మా కుటుంబం సహాయ సహకార పూర్తిగా ఇస్తుంది. ఈ సమయంలో మాకు మీ ప్రేమ మరియు మద్దతు కావాలి” అంటూ అర్బాజ్ ఖాన్ ఫ్యాన్స్ కి తెలియజేసారు.