అత్యద్భుతమైన ’చెత్త పార్కు’.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు 

  • Publish Date - February 29, 2020 / 09:43 AM IST

పార్కులంటే పచ్చని చెట్లు..వాకింగ్ కోసం దారి. పిల్లలు ఆడుకోవటానికి జారుబల్లలు వంటివాటితో అతి సుందరంగా ఉంటుంది. కానీ కర్ణాటకలోని తుమ్మినకట్టి గ్రామంలో ఓ పార్క్ మాత్రం చాలా చాలా డిఫరెంట్. అత్యంత అద్భుతమైన.. ‘చెత్త పార్కు’. అదేంటి అద్భుతం అంటున్నారు..మళ్లీ చెత్త పార్కు అంటున్నారేమిటానుకుంటున్నారా? అక్కడే ఉంది తుమ్మినకట్టి గ్రామవాసులు ప్రత్యేకత. 

15వేల మంది జనాభా కలిగిన తుమ్మినకట్టి గ్రామవాసుల కళాభిరుచికి..సృజనాత్మకతకు అద్దం పడుతుంది ఈ ‘చెత్తపార్కు’. తుమ్మినకట్టిలో వ్యాపార సంస్థలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్లాస్టిక్ వ్యర్ధాలుకూడా అదేస్థాయిలో ఉంటాయి. దీంతో వాడి పడేసినవాటితో గ్రామం అంతా చెత్త చెత్తగా తయారైంది. 

అది వారికి నచ్చలేదు. కానీ వాడకుండా ఉండేలేరు. దీంతో వాడి పడేసిన బీరు బాటిళ్లు..ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్..కూల్ డ్రింక్ వాటిల్స్ వంటివాటిని సేకరించారు. వాటితో ఓ అందమైన పార్కును తయారు చేశారు. అలా వారు వ్యర్ధాలతో తయారు చేసిన పార్కు చూస్తే కళ్లు తిప్పుకోలేం. అంత అందంగా ఉంటుంది ఈ ‘చెత్త పార్కు’. బీరు బాటిల్స్ తో బాతు బొమ్మలు.  

కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ తో మొక్కలకు అందమైన ఫెన్సింగ్ లా తయారుచేశారు.  మరికొన్ని బాటిల్స్ కు రంగులు వేసి..కుందేలు..బొమ్మల్లా..మిక్కీమౌస్ బొమ్మల్లా తయారుచేశారు. వాడి పడేసిన టైర్లు..బాటిల్స్ తో మినియేచర్ గార్డెన్ ఇలా వాడి పడేసిన  వ్యర్ధాలతో అందమైన పార్క్ ను తయారు చేశారు. బాటిల్స్ మూతలతో నడకదారి ఏర్పాటుచేశారు. ఆ పార్క్ చూసినవారంతా..ఆహా..చెత్త ఇంత అందంగా ఉంటుందా? మనసుంటే మార్గం ఉండకపోదు సుమీ అనుకుంటున్నారు. మాగుంది కదూ ఈ చెత్త ఐడియా..బహు బాగుంది కదూ ఈ ‘చెత్త పార్కు‘..!!.

See Also | ఇట్స్ మై డ్యూటీ : 8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నఎమ్మెల్యే