Enforcement Directorate: డబ్బుల కట్టల గుట్టలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..
నిందితుడు (కేసీ వీరేంద్ర) అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు నడుపుతున్నట్లు తేలింది. అంతేగాక, నిందితుడి సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్ నుంచి 3 వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాడు.

Enforcement Directorate
Enforcement Directorate: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను అక్రమ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లో ప్రమేయం ఉన్న ఆరోపణలపై గ్యాంగ్‌టక్‌లో అరెస్ట్ చేసింది.
కేసీ వీరేంద్ర తన సహచరులతో కలిసి సిక్కింలోని గ్యాంగ్‌టక్‌కి వెళ్లి, అక్కడ ఒక క్యాసినో కోసం భూమిని లీజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. (Enforcement Directorate). ఆ సమయంలోనే అరెస్టయినట్లు తెలుస్తోంది.
ఈడీ 30 ప్రాంగణాల్లో తనిఖీలు చేసింది. ఆ తర్వాత వీరేంద్రను అరెస్ట్ చేసింది. ఆ తనిఖీల్లో రూ.12 కోట్లు నగదు, దాదాపు రూ.కోటి విదేశీ కరెన్సీ, రూ 6 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, సుమారు 10 కిలోల వెండి వస్తువులు, 4 వాహనాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
అలాగే, 17 బ్యాంకు ఖాతాలు, 2 బ్యాంకు లాకర్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. వీరేంద్ర సోదరుడు కేసీ నాగరాజ్, కుమారుడు పృథ్వీకి చెందిన ఇళ్లు, ఆఫీసుల నుంచి ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
వారు దుబాయ్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
వీరేంద్రను అరెస్ట్ చేశాక గ్యాంగ్‌టక్ మేజిస్ట్రేట్ ముందు ఆయనను అధికారులు హాజరుపర్చారు. పప్పీ’స్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీ’స్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోల్లో ఈడీ తనిఖీలు చేసింది.
Also Read: తెలుగు ఇండియన్ ఐడల్ 4 ప్రోమో వచ్చేసింది.. సింగర్ శ్రీరామచంద్రకు లేడీ సింగర్ షాక్..
తనిఖీల్లో నిందితుడు (కేసీ వీరేంద్ర) అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు నడుపుతున్నట్లు తేలింది. అంతేగాక, నిందితుడి సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్ నుంచి 3 వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాడు.
డైమండ్ సాఫ్టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9టెక్నాలజీస్ గా వాటిని గుర్తించారు. ఇవి కాల్ సెంటర్లు, గేమింగ్ వ్యాపారానికి సంబంధించినవని అధికారులు చెప్పారు.