Online Gaming Bill: రాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టంగా మారిన ఆన్ లైన్ గేమింగ్ బిల్లు..

ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

Online Gaming Bill: రాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టంగా మారిన ఆన్ లైన్ గేమింగ్ బిల్లు..

Online Gaming Bill 2025

Updated On : August 22, 2025 / 7:39 PM IST

Online Gaming Bill: కేంద్రం తీసుకొచ్చిన ఆన్ లైన్ గేమింగ్ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. రాజ్యసభ ఆగస్టు 21 న ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు.

ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

హానికరమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిషేధించడంతో పాటు ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహించడానికి ఈ బిల్లును తీసుకొచ్చారు.

ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు అన్ని ఆన్‌లైన్ మనీ-గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిషేధిస్తుంది. ఫెసిలిటేటర్లకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.

ఈ ప్లాట్‌ఫామ్‌లను ప్రకటనల ద్వారా ప్రచారం చేయడం కూడా రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.

ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను నిషేధించి.. ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ చట్టం ఇ-స్పోర్ట్స్ కు చట్టపరమైన మద్దతును అందించడంలో సహాయపడుతుంది. గతంలో ఇ-స్పోర్ట్స్ కు చట్టపరమైన మద్దతు లేదు.

ఇ-స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను కూడా ప్రోత్సహిస్తుంది.

బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత, బిల్లు అమల్లోకి వచ్చే తేదీని ప్రకటించడానికి నోటిఫికేషన్ వస్తుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు.

Also Read: Dream 11 సంచలన నిర్ణయం.. MPL, Zupee కూడా.. ఆ సర్వీసులన్నీ వెంటనే బంద్