దటీజ్ దీదీ : డార్జిలింగ్ కొండల్లో మమతా జాగింగ్
- veegam team
- Published On : October 25, 2019 / 10:06 AM IST
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డార్జిలింగ్ కొండల్లో పది కిలోమీటర్లు జాగింగ్ చేశారు. ప్రతి రోజూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేసే దీదీ గురువారం (అక్టోబర్ 24) డార్జిలింగ్ కొండల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా పది కిలోమీటర్లు దూరం జాగింగ్ చేశారు.
డార్జిలింగ్ లో పర్యటించిన మమతా ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కొండ ప్రాంతంలో కాలినడకలో పాల్గొన్నారు. కుర్సియాంగ్ నుంచి మహానది ప్రాంతం వరకు ఉన్న కొండలలో ఐదు కిలోమీటర్ల దూర కాలి నడకనే ప్రయాణించారు. 64 సంవత్సరాల వయస్సులో కూడా ఏమాత్రం దూకుడు తగ్గని దీదీ ఈ ఐదు కిలోమీటర్లు కొండల్ని ఎక్కి..దిగారు.
జాగింగ్ చేస్తున్న సమయంలో స్థానికులు కూడా మమతాతో పాటు జాగింగ్ లో పాల్గొన్నారు. ఆమెతో పలు విషయాలు చర్చించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్ దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ తాను డార్జిలింగ్ లో చేసిన వాకింగ్ ను, జాగింగ్ ల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పర్యావరణ సంరక్షించండి అంటు ఆమె పిలుపునిచ్చారు.
