ప్రపంచవ్యాప్తంగా పనిచేయని ట్విట్టర్
- venkaiahnaidu
- Published on- October 2, 2019 / 08:19 AM IST
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్-2,2019)కొన్ని గంటల పాటు ట్విట్టర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ట్విట్టర్ కొన్ని గంటల పాటు పనిచేయలేదు. ట్విట్టర్లోని ట్వీట్డెక్, ట్వీట్ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెసేజ్…ఇలా ఏవీ పనిచేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ఆండ్రాయిడ్ యూజర్లు, 25 శాతం డెస్క్టాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విట్టర్ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయకుండా పోయిందని ఓ ఇంటర్నెట్ సంస్థ తెలపింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ కంపెనీ సమస్యను త్వరగా పరిష్కరించనున్నట్లు తెలిపింది.
