10వ తరగతి Biology వాట్సాప్ గ్రూపులో పోర్న్ చిత్రాలు, వీడియోలు

  • Publish Date - September 6, 2020 / 12:52 PM IST

Biology group Class 10 : ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన 10వ తరగతి బయోలజీ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ చిత్రాలతో నిండిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్ పట్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అసభ్యకరమైన చిత్రాలు ఉండడం గమనించిన పాఠశాల ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తించకుండా ఉండేందుకు అడ్మిన్ అంతర్జాతీయ ఫోన్ నెంబర్ ను ఉపయోగించారని పోలీసులు గుర్తించారు.




చాట్ గ్రూపులో బయోలజీ బోధించే టీచర్ యొక్క వీడియో కూడా ఉందని, ఫొటోస్ పంపించాలని కొంతమంది విద్యార్థులు చాట్ చేశారని అయితే ఏ ఫొటోస్ అడుగుతున్నాడో తమకు స్పష్టంగా తెలియదన్నారు. నకిలీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారని పాఠశాల ప్రిన్స్ పాల్ తెలిపారు.




‘Biology group Class 10’ పేరిట వాట్సప్ గ్రూప్ కొన్ని అసభ్యచిత్రాలు, వీడియోలు పోస్టు చేసినట్లు పోలీసు అధికారి అలోక్ సింగ్ తెలిపారు. ఈ కేసును ఉత్తర్ ప్రదేశ్ సైబర్ సెల్ కు బదిలీ చేశారు.




ఇటీవలే ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాయిస్‌ లాకర్‌ రూమ్‌’అనే ప్రైవేట్ చాట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బాలికల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి,వారిపై అసభ్యంగా కామెంట్స్‌ చేస్తున్న మైనర్‌ విద్యార్థులపై ఢిల్లీ సైబర్‌ క్రైమ్‌ విభాగం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నోయిడాలోని ఒక ప్రముఖ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసుకున్న 18 ఏళ్ల విద్యార్థి ఆ గ్రూప్‌ అడ్మిన్‌గా గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడిని అతడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి గ్రూప్‌లోని ఇతర విద్యార్థుల సమాచారం సేకరించారు.

చాట్ రూమ్ లో షేర్ చేసిన తన ఇమేజీని చూసిన ఓ విద్యార్థిని ఈ గ్రూప్‌ సంభాషణల స్క్రీన్‌ షాట్స్‌ను బహిర్గతపర్చడంతో మొదట ఈ గ్రూప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి ఆ విద్యార్థిని పోలీసులకు కంప్లెయింట్ చేసింది. తాజాగా యూపీలో వెలుగు చూసిన పరిణామాలు తల్లిదండ్రులకు షాక్ కలిగిస్తున్నాయి.