Pathaan: నాకు కనుక షారూఖ్ కనిపిస్తే అక్కడే దహనం చేస్తా.. అయోధ్య సాధువు క్రూర వ్యాఖ్యలు

షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'పఠాన్‌' చిత్రాన్ని బహిష్కరించాలని ప్రజలకు ఆచార్య విజ్ఞప్తి చేశారు. గతంలో హనుమాన్‌గర్హి పూజారి రాజుదాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేశారు. పఠాన్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ ముందుండి నడిపిస్తోంది. 'పఠాన్' పాటలోని దీపికా పదుకొణె కుంకుమ దుస్తులు, కొన్ని సన్నివేశాలపై ఇప్పటికే వీహెచ్‭పీ అభ్యంతరం వ్యక్తం చేసింది

Will burn Shah Rukh alive if I meet him says Ayodhya seer's shocking comments

Pathaan: పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట ఇప్పటికే అనేక వివాదాలకు కారణమైంది. బీజేపీ సహా రైట్ వింగ్ సంస్థలు ఈ పాటలోని కొన్ని దృశ్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కాస్త కఠువుగా సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సాధువు కఠినాన్ని దాటి క్రూరంగా స్పందించారు. తాను కనుక షారూఖ్ ఖాన్‭ను కలిస్తే.. అతడిని అక్కడికక్కడే దహనం చేస్తానని అన్నారు. అయోధ్యకు చెందిన సాధువు పరమహంస్ ఆచార్య చేసిన వ్యాఖ్యలివి.

Modi and Kharge: ‘కుక్క’ వ్యాఖ్యలపై ఓవైపు కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం.. మరోవైపు విందులో సరదాగా గడిపిన మోదీ, ఖర్గే

ఒక్క షారూఖ్ దగ్గరే ఆయన ఆగలేదు. పఠాన్ సినిమాను ప్రదర్శిస్తే, ఆ సినిమా థియేటర్లను తగలబెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. షారుఖ్‌ను జిహాదీ అంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా సనాతన ధర్మానికి చెందిన వారు నిరసనలు తెలపడం చాలా ఆనందకరమని ఆచార్య అన్ారు. ఒకవేళ తాను కున జాహాదీ షారూఖ్‭ను ఎదురుగా కలిస్తే.. అతడిని అక్కడే దహనం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. బేషరం రంగ్ పాటలో కాషాయాన్ని అవమానించారని ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Amethi 2024: రాహుల్ గాంధీకి అంత దమ్ముంటే, అసలు ఆయన మనిషే అయితే.. అమేథీ ఛాలెంజ్ విసిరిన బీజేపీ

షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రాన్ని బహిష్కరించాలని ప్రజలకు ఆచార్య విజ్ఞప్తి చేశారు. గతంలో హనుమాన్‌గర్హి పూజారి రాజుదాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేశారు. పఠాన్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ ముందుండి నడిపిస్తోంది. ‘పఠాన్’ పాటలోని దీపికా పదుకొణె కుంకుమ దుస్తులు, కొన్ని సన్నివేశాలపై ఇప్పటికే వీహెచ్‭పీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే సినిమాలో మార్పులు చేయాలని చిత్రబృందాన్ని డిమాండ్ చేసింది. ‘బేషరమ్ రంగ్’ అనే పాట టైటిల్‌పై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హిందూ సమాజం ఇలాంటి సినిమాను ఎప్పటికీ అంగీకరించదని వీహెచ్‭పీ పేర్కొంది.