New Rs.1000 Note : రూ.1000 కొత్త నోటు మళ్లీ వస్తుందా..? కేంద్రం కీలక ప్రకటన.. వైరల్ పోస్టులపై క్లారిటీ!
New Rs.1000 Note : గతంలో రద్దు చేసిన రూ. వెయ్యి నోటును మళ్లీ చెలామణిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
- Harish Thanniru
- Updated on- October 28, 2026 / 06:28 PM IST
New Rs 1000 Note Make A Comeback Centre Issues A Key Statement Clarifying Viral Posts
New 1000 Rupee Note : నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.1000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. వీటి స్థానంలో రూ.2వేల నోట్లు తీసుకురాగా.. ఆ తరువాత కాలంలో వాటిని కూడా రద్దు చేశారు. అయితే, త్వరలో రూ. వెయ్యి నోటును మళ్లీ చెలామణిలోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నోటు పసుపు రంగుతో ఉండటంతో పాటు దానిపై ఆలయం బొమ్మ ఉంటుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు దీనిపై క్లారిటీ ఇస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేసింది.
Also Read : Trains Accident : ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46మంది మృతి.. 150మందికిపైగా గాయాలు
రూ.1,000 కొత్త నోటు విడుదల కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్తగా ఎలాంటి రూ.1,000 నోటును జారీ చేయలేదని వెల్లడించింది.
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. పసుపు రంగులో, ఆలయం చిత్రంతో కూడిన రూ.1,000 నోటు త్వరలో అందుబాటులోకి వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ స్పష్టత ఇచ్చింది.
కొత్త కరెన్సీ నోట్ల విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఫొటోలను నమ్మే ముందు వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ, పీఐబీ వంటి ప్రభుత్వ సంస్థల ప్రకటనలను పరిశీలించడం మంచిది. తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంపకుండా ఉండాలని సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద కంటెంట్ కనిపిస్తే.. @PIBFactCheck హ్యాండిల్‌కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. 8799711259 నెంబర్ లేదంటే factcheck@pib.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చునని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది.
