Intimate Photos: మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు కాబోయే భార్య పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో..

ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఉద్దేశ్యంతో తనలాగే మహిళ అని చూడకుండా సోషల్ మీడియాలో పర్సనల్ ఫొటోలు షేర్ చేసేసింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు కాబోయే భార్యను అవమానించిన కారణంగా ఆమెపై కేసు ఫైల్ చేశారు.

Intimate Photos

Intimate Photos: ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఉద్దేశ్యంతో తనలాగే మహిళ అని చూడకుండా సోషల్ మీడియాలో పర్సనల్ ఫొటోలు షేర్ చేసేసింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు కాబోయే భార్యను అవమానించిన కారణంగా ఆమెపై కేసు ఫైల్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడంతో.. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మాజీ గర్ల్ ఫ్రెండ్ తన పాత బాయ్ ఫ్రెండ్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకుంది. అతని వివరాలతోనే లాగిన్ అయి కాబోయే భార్య చాటింగ్ కోసం వెదికింది. వారిద్దరికీ మధ్య జరిగిన సంభాషణలో ఉన్న ఫొటోలను డౌన్ లోడ్ చేసింది.

ఆ తర్వాత ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి మహిళ పర్సనల్ ఫొటోలను అందులో పోస్ట్ చేసింది. దాంతో ఆమెపై పలు సెక్షన్ల ప్రకారం.. కేసులు ఫైల్ చేశారు.