Amazing Hotel: చెట్టుపై పక్షిగూడులోనే హోటల్.. విలాసవంతమైన వింత హోటల్
చెట్టెక్కి కూర్చొనే సరదాల నుంచి చెట్లపైనా రెస్టారెంట్ కట్టేంత రేంజ్ కి వెళ్లిపోయింది మన క్రియేటివిటీ. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు.
- Subhan Ali Shaik
- Published on- October 11, 2021 / 04:19 PM IST
Cuba Hotel(1)
Amazing Hotel: సుఖపడాలని మనస్సులో ఉండాలి బ్యాంకు అకౌంట్లో బ్యాలెన్స్ దండిగా ఉండాలి అంతే.. స్వర్గాన్నైనా నేల మీద పరవొచ్చు.. ఆనందడోలికల్లో ఊగిపోవచ్చు. ఇలాగే ఉంది క్యూబాలోని ఈ హోటల్. భూమికి ఆకాశానికి మధ్యలో చెట్ల చివరంచున పక్షి గూడు వంటి నిర్మాణంలో కుర్చీలు వేసి నడిపించేస్తున్నారు.
చెట్టెక్కి కూర్చొనే సరదాల నుంచి చెట్లపైనా రెస్టారెంట్ కట్టేంత రేంజ్ కి వెళ్లిపోయింది మన క్రియేటివిటీ. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి గదులు, లాంజ్‌లు నిర్మించారు.
వేర్వేరు చెట్ల మీద ఉండే గూళ్ల తరహాలోని ఈ గదులను చేరుకునేందుకు వెళ్లే మార్గం కూడా ప్రత్యేకమే. చెట్లపైనే వేలాడే వుడెన్ బ్రిడ్జీలను ఏర్పాటు చేసి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ హోటళ్లను డిజైన్ చేసిన వ్యక్తి.. వెలిజ్ ఆర్కిటెక్టో. చెట్లపై ఉండే ఈ హోటల్స్ ను, వేలాడే బ్రిడ్జిలను స్థానికంగా స్వర్గధామంగా పిలుస్తారు.
……………………………………………… : ఐఫోన్ ఆర్టర్ చేస్తే..2 నిర్మా సబ్బులొచ్చాయి
