Bangalore Children’s Lemonade Stall : ‘చిరు’వ్యాపారులు .. సెలవుల్లో నిమ్మరసం అమ్మి డబ్బులు సంపాదిస్తున్న చిన్నారులు

సెలవుల్లో ఆడుకుని ఆడుకుని బోర్ కొట్టిన కొంతమంది చిన్నారులు ఏకంగా వ్యాపారవేత్తలుగా మారారు. వారి ఇంటిముందే నిమ్మరసం అమ్మి డబ్బులు సంపాదిస్తున్న చిన్నారులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Bangalore Children's Lemonade Stall ( Photos Aayushi Kuchroo twitter)

Bangalore Children’s Lemonade Stall : వేసవి సెలవు వచ్చాయంటూ చిన్నారులందరికి ఆటవిడుపు. పొద్దు పొద్దున్నే లేవక్కర్లా.. స్కూలుకెళ్లక్కర్లా..బండెడు పుస్తకాల బరువు మోయక్కర్లా..హోమ్ వర్కులు చేయక్కర్లేదు. ఇక అమ్మ పెట్టింది తిని చక్కగా ఆడుకోవటం..అసలిపోయి హాయిగా నిద్రపోవటం. సెలఫోనుల్లో గేములు, కార్టూన్లు చూడటం, అమ్మానాన్నలతో షికార్లు, లేదా అమ్మమ్మా,నాన్నమ్మల వద్దకు తిరగటం.. సెలవుల్లో పిల్లులు చేసేది సాధారణంగా ఇవే ఉంటాయి. కానీ బెంగళూరులో కొంతమంది చిన్నారులు అలా కాదు. ఏకంగా సెలవుల్లో చిన్నారులు ‘చిరు’వ్యాపారులుగా మారిపోయారు. వారి ఇంటి ముందే ఓ బుల్లి షాపు పెట్టుకుని డబ్బులు సంపాదించేస్తున్నారు కొంతమంది పిల్లలు. సెలవుల్లో వ్యాపారుల అవతారం ఎత్తిని ఈ బెంగళూరు చిన్నారులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

కొందరు చిన్నారులు ఓ ఇంటి గేటు ముందు నిమ్మరసం (Lemonade Stall) అమ్ముతున్న ఫొటోను ఆయుషి కుచ్రో అని ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేశారు. హాలిడేస్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారిన చిన్నారులు బెంగళూరులోని ఇందిరాగనగర్‌లోని ఓ ఇంటి ముందు స్టాల్‌ ఏర్పాటు చేసుకున్నారు. స్టడీ టేబుల్‌ నే వ్యాపారానికి ఉపయోగించుకున్నారు. ఆ టేబుల్ పై నిమ్మరసం పెట్టి అమ్ముతన్నారు. వాళ్లే స్వయంగా తమ చిట్టి చిట్టి చేతులతో నిమ్మ రసం తయారు చేసిని అమ్ముతున్నారు. నిమ్మరసం అంటే ఏదో నీళ్లలో కాస్త పంచదార వేసి ఓ నిమ్మకాయ పిండేసి అమ్మేయటం కాదు. చక్కటి ఫ్లావర్లను కూడా జోడిస్తున్నారీ చిరు వ్యాపారులు. వైట్‌ షుగర్‌ లెమనేడ్‌,ప్లేన్ లెమనేడ్‌’,సాల్టెడ్‌ లెమనేడ్’ ఇలా పలు రకాల నిమ్మరసాలను వారే స్వయంగా తయారు చేసిన ఒక్కో గ్లాసు రూ.10లుండగా..వీటిపై డిస్కౌంట్లు కూడా ప్రకటించి మరీ అమ్ముతున్నారీ గడుగ్గాయలు..

పిల్లలు నిమ్మరసం అమ్ముతున్న ఫోటోలను ఆయుషి అనే మహిళ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో ఈ చిన్నారులు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ భావితరం ఎంటర్‌ప్రెన్యూర్స్ లుగా కామెంట్స్ కొట్టేస్తున్నారు. ఆయుషి తన ట్విటర్‌ పోస్ట్‌ చేస్తూ.. చిన్నారులపై ప్రశంసలు కురిపించారు ‘‘ఇందిరానగర్‌ ఇరుకు వీధుల్లో వెళ్తుండగా నాకు కన్పించిందీ దృశ్యం. బోర్‌గా ఉందని ఆ పిల్లలు ఈ విక్రయం ప్రారంభించారట. విక్రయ కళను నేర్చుకునేందుకు సరైన మార్గం, సరైన వయసు’’ అని ప్రశంసించారు. వీరు రేపు ఏ పెద్ద వ్యాపారవేత్తలు అవుతారేమో అని అంటున్నారు నెటిజన్లు..