boy Cooking Skills
Chinese boy Cooking Skills : హార్నీ బుడ్డోడే గానీ బాండీని విష్ణు చక్రంలా తిప్పుతున్నాడు. ఏదో పెద్ద అనుభవం ఉన్న షెఫ్ లాగా ఏం కటింగులిస్తున్నావుగా బాబు అనేలా ఉందీ ఈ పిల్లాడు చేసిన పని. టాలెంట్ ఎవరి సొత్తు కాదనేలా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఎంతోమంది టాలెంట్ ను వెలుగులోకి తెస్తోంది. చిన్నోళ్లు లేదు పెద్దోళ్లు లేదు. మూడు నెలల పసివాళ్ల నుంచి నూరేళ్ల పెద్దాళ్ల వరకు .. రోడ్డు పక్క ఫుడ్ మేకర్స్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ షెఫ్ ల వరకు కటెంట్ ఉండాలే కాదు వైరల్ తప్పదనేలా ఎన్నో వీడియోలో నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి. ఫుడ్ లేదా కుకింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే దానికుండే స్పెషలిటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటువంటిదే ఓ బుడ్డోడు చేసే మ్యాజిక్ మామూలుగా లేదు.
చైనాకు చెందిన ఒక చిన్న పిల్లవాడు మాస్టర్ చెఫ్ లాగా చేతిలో గరిటె పట్టుకొని చేసే విన్యాసాలు చూస్తుంటే ‘ఏందిరా బాబూ గరిటె అంత లేవు ఏంటీ విన్యాసాలు’ అనేలా బాండీలో గరిటెను..తరువాత బాండీని గిరగిరా తిప్పేస్తున్నాడు. ఎంతో అనుభవం ఉన్న షెఫ్ లాగా గరిటెను బాండీకుండే హ్యాండిల్స్ లో చొప్పించి దాన్ని విష్ణు చక్రంలా తిప్పేస్తున్నాడు. ట్విట్టర్ లో ఈ బుడ్డోడు చసే విన్యాసాలు మామూలుగా లేవు. ఈ వీడియో చూసినవారు‘ Wow’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద కుకింగ్ పాన్‌ను ఎలా హ్యాండిల్ చేయగలిగాడు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Black Panther వామ్మో.. పిల్లిపిల్ల అని తెచ్చి పెంచుకుంటే బ్లాక్ పాంథర్ అయ్యింది .. మహిళ షాక్
చైనాలోని నీయాజింగ్ కు చెందిన ఈ పిల్లాడు టాలెంట్ గురించి తల్లి మాట్లాడుతు.. నెలల వయస్సు నుంచే టీవీల్లో కుకింగ్ ప్రోగ్రామ్స్ చూసి ఇంట్రెస్ట్‌గా చూసేవాడని..తన కొడుకు గురించి మురిపెంగా చెప్పింది. అంతేకాదు ఎదుగుతున్న కొద్దీ చెఫ్‌లను ఫాలో అవుతూ స్లిక్ టెక్నిక్స్ డెవలప్ చేసుకున్నాడని తెలిపింది. మరి ఈ బుడ్డోడి టాలెంట్ పై మీరు కూడా ఓ లుక్కేయండీ..
How come this little boy can handle this cooking pan so swiftly and his cooking skill is so amazing~#cooking #China pic.twitter.com/i48YcazOwZ
— Olivia Wong (@OliviaWong123) February 14, 2023