Viral Video: ఎంత ధైర్యం.. దూసుకొచ్చిన పులితో సెల్ఫీ తీసుకున్న యువకుడు

ఆ యువకుడు తన వద్దకు వస్తుంటే ఆ చిరుత కూడా అతడిపై దాడి చేయకుండా ఇది చాలా సాధారణమే అన్నట్లు వ్యవహరించింది.

Viral Video: ఎంత ధైర్యం.. దూసుకొచ్చిన పులితో సెల్ఫీ తీసుకున్న యువకుడు

Viral Video

మనం ఉండే ప్రాంతంలోకి సినీనటులు, రాజకీయ నాయకులు వస్తే వారి వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటాం. అయితే, ఓ యువకుడు తన పొలంలోకి దూసుకొచ్చిన చిరుతతో సెల్ఫీ తీసుకుని అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చిరుత కనపడిందంటే చాలు పరుగులు తీస్తారు జనాలు. అది తమపై దాడి చేస్తుందేమోనని భయపడిపోతారు. దాని వద్దకు వెళ్లాలంటే కొండంత ధైర్యం ఉండాలి. మనుషులను చూస్తే చాలు చిరుత దాడి చేస్తుంది. ఈ యువకుడు మాత్రం దర్జాగా దాని వద్దకు నడుచుకుంటూ వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు. చాలా సులువుగా దాని వద్దకు అతడు వెళ్లిన తీరు విస్మయం కలిగిస్తోంది.

ఆ చిరుత తన ఫ్రెండే అన్నట్లుగా ఆ యువకుడు వ్యవహరించాడు. ఆ యువకుడు తన వద్దకు వస్తుంటే ఆ చిరుత కూడా అతడిపై దాడి చేయకుండా ఇది చాలా సాధారణమే అన్నట్లు వ్యవహరించింది. ఈ ఘటన ఉత్తర భారత్ లోని ఓ రాష్ట్రంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏ ప్రాంతంలో జరిగిందో కచ్చితమైన వివరాలు లేవు. ఆ యువ రైతుకి చిరుతలు అంటే ఇష్టమేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప కంటే ఆ యువకుడు చాలా గ్రేట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

Also Read: సిగ‌రేట్ తాగుతున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను త‌దేకంగా చూసిన వ్య‌క్తి హ‌త్య‌