Nagpur : సిగరేట్ తాగుతున్న ఇద్దరు మహిళలను తదేకంగా చూసిన వ్యక్తి హత్య
ఇద్దరు మహిళలు సిగరేట్ తాగుతుండగా వారి వైపు తేదకంగా చూసిన వ్యక్తి హత్య చేయబడ్డాడు.

Man Killed For Staring At 2 Women Smoking at shop
ఇద్దరు మహిళలు సిగరేట్ తాగుతుండగా వారి వైపు తదేకంగా చూసిన వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగ్‌పూర్‌లోని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి జయశ్రీ పంజాడే తన స్నేహితురాలు సవితా సాయిరేతో కలిసి పాన్‌షాప్ ఎదుట నిలబడి సిగరేట్ తాగుతున్నారు. అదే సమయంలో సిగరెట్లు కొనుగోలు చేసేందుకు 28 ఏళ్ల రంజిత్ రాథోడ్ అనే వ్యక్తి అక్కడకు వచ్చారు. అతడు వారిద్దరి వైపు అదే పనిగా చూడసాగాడు. దీంతో మహిళలు ఆగ్రహానికి లోనుకావడంతో వారి మధ్య గొడవ జరిగింది.
జయశ్రీ తనను దర్భాషలాడడం, అతడి వైపు చూస్తూ పొగ ఊదిన మొత్తాన్ని రంజిత్ రాథోడ్ వీడియో తీయడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో జయశ్రీ తన స్నేహితుడు ఆకాష్ రౌత్‌కు ఫోన్ చేసింది. అక్కడకు రమ్మని చెప్పింది. అక్కడకు వచ్చి ఆకాష్ రౌత్ కత్తితో రంజిత్‌ను పలు మార్లు పొడిచాడు. దీంతో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడని పాన్ షాపు యజమాని లక్ష్మణ్ తావ్డే తెలిపాడు.
Work Pressure : ద్యావుడా.. ఆఫీసుకి టైమ్‌కి రమన్నాడని.. సీనియర్ ఉద్యోగి హత్యకు సహచరుల కుట్ర
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న రంజిత్ రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీని భద్రపరిచారు. జయశ్రీ, సవిత, ఆకాష్‌లను అరెస్ట్ చేశారు.