Work Pressure : ద్యావుడా.. ఆఫీసుకి టైమ్‌కి రమ్మన్నాడని.. సీనియర్ ఉద్యోగి హత్యకు సహచరుల కుట్ర

టైమ్ కి ఆఫీసుకి రావాలని, ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలని వారిపై బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాదు ఉన్నతాధికారుల ముందుకి తీసుకెళ్లి వారిద్దరిని బాగా తిట్టేవాడు.

Work Pressure : ద్యావుడా.. ఆఫీసుకి టైమ్‌కి రమ్మన్నాడని.. సీనియర్ ఉద్యోగి హత్యకు సహచరుల కుట్ర

Work Pressure : ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అన్నాక కచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఉన్నత సిబ్బంది నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. సమయానికి ఆఫీసుకి రావాల్సిందే, నిబద్ధతతో పని చేయాల్సిందే. వాళ్లు ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాల్సిందే. ఒక్కోసారి ఆఫీసు అవర్స్ పట్టించుకోకుండా పని చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది చాలా కామన్. డ్యూటీ విషయంలో పైస్థాయి సిబ్బంది ఒక్కోసారి కోపగించుకున్నా, తిట్టినా, మందలించినా, హెచ్చరించినా.. భరించాల్సిందే, పడాల్సిందే. ప్రైవేట్ జాబ్ అంటే అంతే మరి. ఒత్తిడి తట్టుకోలేని వాళ్లు జాబ్ మానేసి వెళ్లిపోవచ్చు. మరో ఉద్యోగం చూసుకోవచ్చు.

అయితే, సీనియర్ ఉద్యోగి సరిగా డ్యూటీ చేయాలని ఒత్తిడి చేశాడని ఆ కంపెనీలోని ఉద్యోగులు రెచ్చిపోయారు. ఆ సీనియర్ ఉద్యోగి హత్యకు కుట్ర పన్నారు. గూండాలతో అతడిని లేపేయాలని స్కెచ్ వేశారు. గూండాలతో కట్టించి చంపించాలని చూశారు. ఏంటి షాక్ అయ్యారా? బెంగళూరులో ఈ దారుణం జరిగింది.

సురేశ్.. ఈస్ట్ బెంగళూరులోని ఓ పాల ఉత్పత్తుల కంపెనీలో ఆడిటర్ గా పని చేస్తున్నారు. ఉమా శంకర్, వినేశ్ కూడా అదే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అయితే వారిద్దరూ సరిగా డ్యూటీకి వచ్చే వారు కాదు. ఆఫీసుకి వచ్చినా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారు. ఇది గమనించిన సురేశ్.. వారిద్దరిని హెచ్చరించారు. సరిగా డ్యూటీ చేయాలని మందలించాడు. టైమ్ కి ఆఫీసుకి రావాలని, ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలని వారిపై బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాదు ఉన్నతాధికారుల ముందుకి తీసుకెళ్లి వారిద్దరిని బాగా తిట్టేవాడు. దీంతో ఆ ఇద్దరు తట్టుకోలేకపోయారు. పని చేయాలని ఒత్తిడి చేయడం, తమను పదే పదే తిట్టడాన్ని సహించలేకపోయారు. సురేశ్ పై వాళ్లిద్దరూ కోపంతో రగిలిపోయారు. అంతే, సురేశ్ ను హత్య చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేఆర్ పురంకి చెందిన కొందరు కిరాయి గూండాలతో డీల్ కుదుర్చుకున్నారు.

మార్చి 31న కళ్యాణ్ నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గూండాలు సురేశ్ ను అడ్డగించారు. రాడ్ తో ఆయనపై దాడి చేశారు. రోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టారు. ఇదంతా ఓ కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. వారి విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. సహచర ఉద్యోగులే సురేశ్ హత్యకు కుట్ర పన్నారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఉమా శంకర్, వినేశ్ లను అదుపులోకి తీసుకుని విచారించగా.. వాళ్లు నేరం ఒప్పుకున్నారు. సురేశ్ డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడని.. పని చేయాలని తమపై ఒత్తిడి తెచ్చాడని, ఉన్నతాధికారులతో తమను తిట్టించాడని, అందుకే అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

సరిగా పని చేయాలని ఒత్తిడి చేసిన ఉద్యోగి హత్యకు సహచర ఉద్యోగులు కుట్ర పన్నడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి అంతా షాక్ కి గురయ్యారు. సరిగా డ్యూటీ చేయాలని చెప్పడం కూడా నేరమేనా? అని అవాక్కవుతున్నారు. డ్యూటీ చేయమని చెప్పినందుకు చంపేయాలని చూస్తారా? ఇదెక్కడి దారుణం? అని మండిపడుతున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలని కంపెనీలో పని చేసే ఇతర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : దారుణం.. చదువుకోవడం లేదని కూతురిని కొట్టి చంపిన తండ్రి