ఒకప్పటి హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఇక తాజాగా లయ ‘ట్రెండింగో’ అనే సాంగ్ లాంచ్‌కు చీరకట్టులో హాజరై అందరి చూపులను ఆకట్టుకుంది.