Apple iPhone 17 Pro : వారెవ్వా! ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 17 ప్రోపై ఏకంగా రూ. 22వేలు తగ్గింపు..!

Apple iPhone 17 Pro : ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ సమయంలో రూ. 82వేల లోపు ధరకే లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 22వేలు డిస్కౌంట్ పొందవచ్చు.. పూర్తి ఆఫర్ వివరాలివే..

1/6
Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై అదిరిపోయే డీల్‌ అందిస్తోంది. ఈ ఐఫోన్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఇతర మొబైల్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
2/6
ముఖ్యంగా ఆపిల్, శాంసంగ్, షావోమీ, ఒప్పో, వివో వంటి బ్రాండ్‌ల నుంచి అనేక ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు లిస్టులో ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై అత్యంత ఆకర్షణీయమైన డీల్ లభిస్తోంది. మీరు కూడా ఈ ఫ్లాగ్‌షిప్ ఆపిల్ ఐఫోన్‌ తక్కువ ధరకు కొనాలని భావిస్తే ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఐఫోన్ 17 ప్రో డిస్కౌంట్ : ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ ఈ ఐఫోన్‌ను గత ఏడాదిలో రూ. 1,34,900 ధరకు లాంచ్ చేయగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,22,900కే లభిస్తోంది. ఈ ఐఫోన్‌ నేరుగా రూ. 12వేలు తగ్గింపుతో పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఐఫోన్ మోడల్ ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
4/6
ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు : ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ బ్యాంక్ ఆఫర్ అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఐఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. మీకు అదనంగా రూ. 10వేలు తగ్గింపు లభిస్తుంది. మీరు మొత్తం రూ. 22వేలు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్లలో ఇప్పటివరకూ ఇంతకన్నా తగ్గింపు ఆఫర్ లేదనే చెప్పాలి.
5/6
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోలో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. మంచి సినిమాటిక్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌లో కంపెనీ సరికొత్త A19 ప్రాసెసర్ ఉంది. హెక్సాకోర్ ప్రాసెసర్ కూడా అమర్చారు. ఈ ఐఫోన్‌లో 48MP + 48MP + 48MP కెమెరా సెటప్ ఉంది. DSLR రేంజ్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు.
6/6
ఈ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 18MP సెల్ఫీ కెమెరా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐఫోన్ 17 ప్రో IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను 30 నిమిషాల పాటు 6 మీటర్ల లోతులో ఉంచినా చెక్కుచెదరదు.