iPhone 17 Pro Series : ఓరినాయనో..! ఆపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మరి ఇంత తక్కువ ధరకా?

Apple iPhone 17 Pro Series : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/7
Apple iPhone 17 Pro Series : ఆపిల్ లవర్స్ కు భారీ గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అతి త్వరలో ఐఫోన్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పుడు కొనడమే బెటర్.. ఆపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో ప్రో మ్యాక్స్‌ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.
2/7
అంతకన్నా ముందుగానే ఐఫోన్ 17 ప్రో మోడళ్ల ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఏఐ డిమాండ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత ఏర్పడింది. ఫలితంగా రాబోయే కొత్త ఐఫోన్ల ధరలను ఆపిల్ పెంచాలని చూస్తోంది.
3/7
ఐఫోన్ల ధరలు పెరగక ముందే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ప్రో మోడల్స్ తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ డైరెక్ట్ డిస్కౌంట్‌ మాత్రమే కాదు.. బ్యాంక్ కార్డు ఆఫర్లతో కూడా మరింత ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/7
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ డీల్ : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,37,900 ధరకు లభిస్తోంది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 1,49,900 కాగా, ఇప్పుడు రూ. 12,000 తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. మరో రూ. 9వేలు తగ్గింపు లభిస్తుంది. ఫైనల్ ధర రూ. 1,28,900 అవుతుంది.
5/7
మీ పాత ఫోన్‌ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌ బట్టి రూ. 47,350 వరకు ట్రేడ్-ఇన్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో 6 నెలల పాటు నెలకు రూ. 22,317 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది.
6/7
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ. 1,34,900 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,22,900 ధరకు అమ్ముడవుతోంది. ప్రారంభ ధరపై రూ. 12వేలు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. మరో రూ. 9వేలు తగ్గుతుంది. దాంతో ఫైనల్ ధర రూ. 1,13,900 అవుతుంది.
7/7
ఫ్లిప్‌కార్ట్‌లో 6 నెలలకు నెల చొప్పున రూ. 19,817 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఇంకా తగ్గింపు పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ కండిషన్‌ బట్టి ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 47,350 వరకు ఉండవచ్చు.