Apple iPhone Air Price : వావ్.. ఐఫోన్ ఎయిర్ ఇంత తక్కువ ధరకా? ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..

Apple iPhone Air Price : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఈ కొత్త ఐఫోన్ ఎయిర్ మోడల్ భారీగా తగ్గింది. ఏకంగా రూ. 20వేలు తగ్గింపుతో లభిస్తోంది.

1/8
Apple iPhone Air Price : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2 అతి త్వరలో రాబోతుంది. అంతకన్నా ముందే ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుత ఐఫోన్ ఎయిర్‌పై విజయ్ సేల్స్‌లో చౌకైన ధరకే లభిస్తోంది.
2/8
భారత మార్కెట్లో రూ. 1,19,900 ధరకు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 20వేలకుపైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ ధరలో 6.5-అంగుళాల డిస్‌ప్లే, ఎ19 చిప్‌సెట్ 12GB ర్యామ్ అందిస్తుంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..
3/8
మీరు ఐఫోన్ ఎయిర్ కొనాలని చూస్తుంటే ఈ డీల్‌ను అసలు మిస్ చేసుకోవద్దు. విజయ్ సేల్స్‌లో ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/8
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌ రూ. 1,19,900 ధరతో లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం ఈ ఐఫోన్ మోడల్ కేవలం రూ. 98,990కే లభిస్తోంది. ప్రారంభ ధరపై రూ. 20,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
5/8
ఈ డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు, HDFC బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఐఫోన్ ఎయిర్ ధర రూ. 94,990కి లభిస్తుంది. ఈ ఇ-కామర్స్ దిగ్గజం 6 నెలలకు నెల చొప్పున కేవలం రూ. 15,831 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
6/8
ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 3,000 నిట్స్ వరకు అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A19 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అంతేకాదు.. 12జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ కూడా అందిస్తుంది.
7/8
ఈ ఐఫోన్ మోడల్ 3,100mAh బ్యాటరీతో వస్తుంది. 20W వైర్డ్ ఛార్జింగ్, 12W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జర్ సపోర్ట్ ఉంది. కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 48MP ఫ్యూజన్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 18ఎంపీ కెమెరా ఉన్నాయి.
8/8
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కొనాలా? వద్దా? : మీరు ఈ ఐఫోన్‌ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మోడల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకవేళ ఈ ఐఫోన్ మోడల్ వద్దని అనుకుంటే అప్పుడు ఐఫోన్ 16 ప్రో ఎంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ మోడళ్లలో చూస్తే శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, షావోమీ 14 అల్ట్రా వంటి ఫోన్లను కొనేసుకోవచ్చు.