Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. పెళ్లి మండపం చూశారా..? బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసి..
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఆలయం నమూనాలో భారీ పెళ్లి మండపం సెట్స్ వేశారు. మెయిన్ పెళ్లి మండపం పక్కనే అతిధులు కూర్చోడానికి మరికొన్ని మండపం సెట్స్ వేశారు. భారీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలను, అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసారు. మండపం మొత్తం పూలతో అలంకరించారు. మొత్తానికి కూతురి పెళ్ళికి బండ్ల గణేష్ బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసాడని అంటున్నారు.
- Saketh U
- Published on- August 17, 2026 / 07:09 AM IST
Bandla Ganesh Daughter Wedding Stage Set
