Chandrahas Kotla : చంద్రహాస్ కోట్ల హీరోగా.. ఓ పిట్టకథ దర్శకుడి మూవీ ప్రారంభం..
Chandrahas Kotla : చంద్రహాస్ కోట్ల హీరోగా చెందు ముద్దు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 19, 2026 / 11:44 AM IST
Chandrahas Kotla : చంద్రహాస్ కోట్ల హీరోగా చెందు ముద్దు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా.ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టారు. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ స్క్రిప్ట్ అందజేశారు. దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి శివారెడ్డి ఎస్వి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా వెంకట ప్రభు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. కాగా.. చెందు ముద్దు ఓ పిట్ట కథ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
