CM Revanth Reddy : ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు.. అక్కడే భోజనం.. ఫొటోలు వైరల్..
CM Revanth Reddy : కొడంగల్ నియోజకవర్గంలోని పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించారు. వారింట్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత స్థానిక పిల్లలతో కలిసి టపాసులు కాల్చి "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిల్లలందరికీ పెన్నులను బహూకరించారు.
- Harish Thanniru
- Published on- November 8, 2026 / 08:27 PM IST
