Nakshathra : ‘ఇరుముడి’ సినిమాలో రవితేజ కూతురుగా నటించే ఈ చిన్నారి ఎవరో తెలుసా?
ఈ సినిమాలో రవితేజ కూతురుగా నక్షత్ర అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటిస్తుంది. (Nakshathra)
- Saketh U
- Published on- June 30, 2026 / 03:11 PM IST
'ఇరుముడి' సినిమాలో రవితేజ కూతురుగా నటించే ఈ చిన్నారి ఎవరో తెలుసా?
రవితేజ ఇరుముడి సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ కూతురుగా నక్షత్ర అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటిస్తుంది.
నక్షత్ర ఫ్యామిలీ కేరళ కన్నూర్ కి చెందిన వారు. నక్షత్ర చిన్నప్పట్నుంచీ పలు యాడ్స్ లో నటించింది. కేరళలో అనేక లోకల్ యాడ్స్ లో నటించింది.
అనంతరం మలయాళంలో రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నక్షత్ర నటించింది.
ఇప్పుడు రవితేజ ఇరుముడి సినిమాతో పాటు కన్నడలో శివ రాజ్ కుమార్ డాడ్ సినిమాలో, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నోబడీ సినిమాలో నటిస్తుంది.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేలాగా నక్షత్ర వర్క్, ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తున్నారు ఈ చిన్నారి పేరెంట్స్. నక్షత్ర పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఇప్పటికే ఇరుముడి నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్ తో నక్షత్రకు మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా తర్వాత నక్షత్రకు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
