FIFA World Cup 2026 : ఘనంగా ప్రారంభమైన ఫుట్‌బాల్ పండుగ.. ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ ఫోటోలు.. వైరల్
మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక ఎస్టాడియో అజ్టెకా మైదానంలో 2026 ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026) పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 12, 2026 / 08:05 AM IST
మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక ఎస్టాడియో అజ్టెకా మైదానంలో 2026 ఫిఫా ప్రపంచ కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకలు కనులపండుగగా సాగాయి.
సంగీతం, నృత్య ప్రదర్శనలు, అద్భుతమైన లైటింగ్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కొలంబియన్ పాప్ సింగర్ షకీరా తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది.
ఆమెతో పాటు నైజీరియా బర్నా బాయ్ ప్రపంచకప్ అధికారిక గీతం డాయ్ డాయ్ ను పాడి ఫ్యాన్స్‌ను అలరించారు
ఎస్టాడియో స్టేడియం మొత్తం ఆకుపచ్చ రంగులో మెరిసిపోయింది.
కొలంబియా సింగర్ బాల్విన్‌తో పలువురు అంతర్జాతీయ కళాకారులు కూడా తమ ప్రదర్శనలతో సందడి అలరించారు.
మెక్సికో సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ మెగాటోర్నీలో మరో రెండు సార్లు ఆరంభ వేడుకలు జరగనున్నాయి.
ఈ మెగాటోర్నీకి మెక్సికోతో పాటు కెనడా, అమెరికాలు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
నేడు (శుక్రవారం) కెనడాలోని టొరంలోలో, శనివారం అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఆరంభ వేడుకలు జరగనున్నాయి.
