Flipkart Goat Sale : ఐఫోన్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఐఫోన్ 17 ప్రోపై ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్..!
Flipkart Goat Sale : ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్ మొదలైంది.. ఇందులో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రోపై ఏకంగా రూ. 20వేలు తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- July 4, 2026 / 05:29 PM IST
Flipkart Goat Sale : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సందర్భంగా ఐఫోన్ 17 ప్రో అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లతో ఐఫోన్ 17 ప్రోపై బెస్ట్ డీల్స్ పొందవచ్చు. ఈ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అదనపు సేవింగ్ పొందవచ్చు. ఐఫోన్ 17 ప్రోపై బెస్ట్ డీల్స్, మరెన్నో డిస్కౌంట్లు, ధరలకు సంబంధించి పూర్త వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఐఫోన్ 17 ప్రో ధర, ఆఫర్లు :
గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 1,34,900 ధరకు లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో (256GB స్టోరేజ్ వేరియంట్) ఇప్పుడు ఈ-కామర్స్ సైట్‌లో రూ. 1,24,900 ధరకు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 10వేలు తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ధర రూ. 1,14,900కు తగ్గింది.
ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 20వేలు తక్కువకే లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కోసం పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడంపై రూ. 60,300 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బ్రైట్ నెస్, ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రో మోడల్ 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2622x1206 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz టాప్ బ్రైట్‌నెస్ 3,000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో USB 3.0 టైప్-C పోర్ట్, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6 ఉన్నాయి.
