Gold Price Today : భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు మంచి అవకాశం.. నేటి ధరలు ఇవే..

Gold Price Today : మంగళవారం పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ (బుధవారం) తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది.

1/8
ఉగాది పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.
2/8
ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు సాధారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే, ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో మార్కెట్లలో అనిశ్చితి పెరిగినా.. బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.
3/8
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.330 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సుగోల్డ్ పై 21డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,985 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,57,750కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,44,600 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,240 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,060 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,950కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,45,700 వద్దకు చేరింది.
7/8
వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,75,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,65,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.