Gold Price Today : అరెరే.. మళ్లీ ఏమైంది..! బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..
Gold Price Today : గురువారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ (శుక్రవారం) బిగ్ షాకిచ్చాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్, సిల్వ రేట్లు భారీగా పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : March 20, 2026 / 11:05 AM IST
ఉగాది పండుగ రోజున (గురువారం) భారీగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా కొనుగోలుదారులకు వీటి ధరలు బిగ్ షాకిచ్చాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రామలు 24 క్యారట్ల బంగారంపై రూ.650 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 70 డాలర్లు పెరగడంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,719 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం కిలో వెండిపై రూ.10వేలు తగ్గగా.. ఇవాళ (శుక్రవారం) రూ.100 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,080 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,500 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,50,930కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,38,50 వద్దకు చేరింది.
వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,64,900 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,64,900 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
