Gold Rate Today : దిమ్మతిరిగే షాకిచ్చిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇంత తేడానా..! ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఇవాళ భారీగా పెరిగింది.
- Harishth Thanniru
- Published On : March 28, 2026 / 11:43 AM IST
మొన్నటి వరకు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం గోల్డ్ రేటు భారీగా పెరగ్గా.. ఇవాళ (శనివారం) కూడా పెరిగింది. వెండి సైతం ఇవాళ పెరిగింది. దీంతో 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రెండు రోజుల్లో రూ. రూ. 3500 పెరిగింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావరణంకుతోడు రూపాయి విలువ కుప్పకూలడం, డాలర్ బలం పుంజుకోవడంతో కూడా పసిడి ధరలు ఎగబాకుతున్నాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,510 పెరగ్గా.. 22క్యారట్ల బంగారంపై రూ.2300 పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 161 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,488 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.15వేలు తగ్గుదల చోటుచేసుకోగా.. ఇవాళ (శనివారం) కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,750 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,220 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,35,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,48,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,35,750 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలో ఇవ్వాళ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్దకు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
