Telugu » Photo-gallery » Gold And Silver Price In Hyderabad Visakhapatnam Delhi Today 2nd March 2026 Full Details Hn
Gold Price Today : యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గెంతేస్తారు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Price Today : ఇరాన్ - ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే, అందుకు విరుద్ధంగా సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య వార్ క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ యుద్ధ తీవ్రతను పెంచేసింది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపైనా బాంబుల వర్షం కురిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వార్ కారణంగా మార్కెట్లుసైతం కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వార్ ఎఫెక్ట్ పసిడి మార్కెట్లపై గట్టిగానే పడింది. ధరలు ఎలా మారుతాయో పెట్టుబడిదారులకు అర్థం కావడం లేదు.
2/8
ఇరాన్ - ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. అయితే, అందుకు విరుద్ధంగా సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ రేటులో వేలల్లో తగ్గుదల చోటు చేసుకుంది. అయితే, ఈ తగ్గుదల కొనసాగుతుందా.. లేక మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుతాయా అనే అంశంపై అంతుచిక్కడం లేదు. నిపుణుల అంచనాల ప్రకారం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
3/8
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 3,290 తగ్గుదల చోటు చేసుకుంది. 22క్యారెట్ల గోల్డ్ పై రూ. 3వేలు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఏకంగా 72డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు బంగారం 5,349 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శని, ఆదివారాల్లో భారీగా పెరిగిన వెండి ధర.. ఇవాళ మాత్రం తగ్గింది. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,69,800కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,55,650 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,69,950 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,55,800 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,69,800కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,55,650 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,70,840 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,56,600 వద్దకు చేరింది.
7/8
వెండి ధరలో ఇవాళ భారీ తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,15,000కు చేరుకుంది. అయితే, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండిపై రూ.35వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఆయా నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,30,000వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,15,000 వద్దకు కొనసాగుతుంది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.